ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌ రేసులో పోకూరి రవీంద్రబాబు

1001734639

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు తగిన గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ పోకూరి రవీంద్రబాబు పేరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది.

మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలను ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుపుతూ రవీంద్రబాబు చేస్తున్న సేవలను జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు గుర్తిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి కేటాయించిన నేపథ్యంలో, వైస్ చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలించాలని పలువురు నాయకులు కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించే వారికి ఉన్నత పదవులు ఇస్తే శ్రేణుల్లో మరింత జోష్ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై పార్టీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడితేనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.