
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంది చలనచిత్ర నిబంధనలు అనుసరించి 2025 వ సంవత్సరానికి ఉత్తమ ఫిల్మ్ నిర్మాణాలు, ఉత్తమ కళాకారులు మరియు ఉత్తమ సాంకేతిక నిపుణులకు గాను తెలుగు భాషలో భారతదేశంలో ఎక్కడైనా నిర్మించబడిన మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బహిరంగ ప్రదర్శన కొరకు దృవీకరించబడిన కథా చిత్రాలు, జాతీయ సమైక్యతపై కథా చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యాసంబంధమైన చిత్రాలు మరియు తెలుగు సినిమా మీద పుస్తకాలు/రచనలు చిత్రాల నిమిత్తం చిత్ర నిర్మాతల నుండి దరఖాస్తుల తేదిలను పొడిగించడమైనది.
2025 వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది టి.వి. చిత్ర నిబంధనలను అనుసరించి ఉత్తమ టి.వి. చిత్ర నిర్మాణానికి, ఉత్తమ కళాకారులకు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు మరియు టెలిఫిలింస్, టి.వి. ఫీచర్స్, టి.వి. మెగాసీరియల్స్, టి.వి. డైలీ సీరియల్స్, టి.వి. బాలల చిత్రాలు, టి.వి. డాక్యుమెంటరీ చిత్రాలు, టి.వి. సామాజిక అంశాల చిత్రాలు మరియు టి.వి. విద్యాబోధన చిత్రాల నిమిత్తం టి.వి. చిత్ర నిర్మాతల నుండి దరఖాస్తుల తేదిలను పొడిగించడమైనది.
వివరాలకు మా సంస్థ Website: www.apsftvtdc.in లో చూడగలరు. దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరుచుటకు చివరి తేది 20.10.2026. ఆన్లైన్లో పొందుపరిచిన ధరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత ప్రతులతో జతపరచి మా సంస్థకు అనగా మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, 4వ అంతస్తు, ఎన్.టి.ఆర్. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రు బస్ కాంప్లెక్స్, విజయవాడ – 520013 పంపుటకు చివరి తేది 25.10.2026 అందించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.ఎస్. విశ్వనాథన్, ఐ.ఎ.ఐస్., గారు తెలియజేశారు.
