
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ధర్మం కోసం సమరం’ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. కృష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 17వ శతాబ్దం నేపథ్యంలో ధర్మం కోసం పోరాడే వీరుడి కథను చెబుతుంది. పవన్ ఖడ్గంతో యుద్ధ వీరుడిగా కనిపించే పోస్టర్, యుద్ధ దృశ్యాలు, గుర్రాలతో ఆకట్టుకుంటోంది. ఏ.ఎం. రత్నం నిర్మాణంలో, మెగా సూర్య ప్రొడక్షన్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ అదనపు ఆకర్షణ. అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. అభిమానులు ఈ భారీ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.