మంచు లక్ష్మీ కంట తడి – ఏం జరిగింది?

WhatsApp Image 2024 10 29 at 17.59.58 4cea1e2a

దీపావళి సందర్భంగా ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ రెడీ అయింది. దీపావళి పండుగకు బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రాం రెడీ అయింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది అంటూ శ్రీముఖి రాబోతోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ పండుగ ఈవెంట్లో మంచు లక్ష్మీ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చాలా రోజుల తరువాత మళ్లీ ఈటీవీ కార్యక్రమంలో అనసూయ గెస్టుగా పాల్గోన్నారు.

శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్‌లో.. అందమైన డాన్స్ ప్రదర్శనలు, ఆటలు, స్కిట్స్‌ ఎంటర్టైన్ చేయబోతోన్నాయి. సోనియాకి పెళ్లి చేసుకోవాలి అని కాన్సెప్ట్.. అనసూయ ఒక సంబంధం, మంచు లక్ష్మి ఒక సంబంధం తీసుకురావడం వంటి కాన్సెప్ట్‌తో షో ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోంది. మంచు లక్ష్మిపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె కూతురు భావోద్వేగంతో ప్రశ్నించినప్పుడు, లక్ష్మి గారు ఎలా సమాధానం చెప్పారో, ఎంత నిజాయితీగా స్పందించారో ఈ ఎమోషనల్ స్కిట్లో చూపించి ఏడ్పించేశారు. మంచు లక్ష్మీకి తన కూతరు విద్యా నిర్వాణ అంటే ఎంత ప్రేమో ఈ స్కిట్లో తెలియజేశారు.