‘ఆపరేషన్ వాలెంటైన్’ జెన్యూన్ రివ్యూ

Screenshot 2024 03 01 163603

మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటిస్తూ మన ముందుకు వచ్చిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ . ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత అతని ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. వెంకటేశ్‌ తో కలిసి చేసిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు విజయం సాధించాయి కానీ ఈ మధ్యలో వచ్చిన ‘గని, గాండీవధారి అర్జున’ చిత్రాలు నిరాశ పరిచాయి. కాగా లావణ్య త్రిపాఠి తో తన పెళ్లి తరువాత వస్తున్న సిఎంమా కాబట్టి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అందరి దృష్టీ దీనిపైనే ఉంది. తన సెకండ్ మూవీ ‘కంచె’లో ఆర్మీ జవాన్ గా నటించిన వరుణ్ తేజ్, ఈ లేటెస్ట్ ఫిల్మ్ లో ఎయిర్ వింగ్ కమాండర్ గా నటించాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తిప్రతాప్ సింగ్ హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న జనం ముందుకు వచ్చింది.

2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పుల్వామా పై దాడి చేసి భారత సైనికులు 40 మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇది జరిగిన 12 రోజులకు, ఫిబ్రవరి 26న భారతదేశానికి చెందిన వైమానిక దళం పాకిస్తాన్ లోని బాల్ కోట్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. అదే కథాంశంతో ఇప్పుడీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జతగా బాలీవుడ్ నటి మనిషి చ్చిల్లర్ నటించగా మరి కొంత మంది పెద్ద కాస్టింగ్ నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించినా… కొంత వరుకు సొంత క్రియేటివిటీ తో ఈ సినిమా రారూపొందించారు.

కథ విషయానికి వస్తే… మన దేశానికి ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పని చేస్తున్న అర్జున్ దేవ్ తన నేతృత్వంలో వజ్ర అనే మిషన్ టెస్ట్ ట్రయిల్ చేస్తారు. అందులో అర్జున్ చేసిన పొరపాటు వాళ్ళ అతని స్నేహితుడు, ఎయిర్ ఫోర్స్ కు చెందిన కబీర్ మరణిస్తాడు. దాంతో వజ్ర మిషన్ ను రాడార్ కంట్రోలర్ ఆహనా గిల్ నిలిపివేస్తుంది. ఇది జరిగిన కొంత కాలానికి కశ్మీర్ లోని పుల్వామాపై దాడి జరుగుతుంది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంపికైన ఎయిర్ ఫోర్స్ టీమ్ లో అర్జున్ కూడా చేరతాడు. అప్పటికే అతను వజ్ర తాలూకు గాయాల నుండి బయటపడతాడు. వజ్ర ఆపరేషన్ లో ఫెయిల్ అయిన కారణం, పాకిస్థాన్ మీద కొంత కోపం తో ఉన్న అర్జున్ … ఈసారి పాకిస్తాన్ పై జరిపిన ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ లో విజయం సాధించాడా? తన పై అధికారుల మాటలను ఈసారైనా అతను విన్నాడా? ఈ ఆపరేషన్ లో అతనికి ఎదురైన ప్రతిబంధకాలేమిటీ? అనేదే ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ. అయితే… ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది సినిమా.

సహజంగా దేశభక్తిని ప్రేరేపించేలా వచ్చే చిత్రాలలో తప్పొప్పులను పట్టుకోవడం సమంజసంగా అనిపించదు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు, వారి వీరగాథలను వెండితెర మీద చూసి ప్రేరణ పొందాలి లేదంటే ఆనందించాలి. అయితే వాటిని జనరంజకంగా మలిస్తే మరింత మందిని చేరే ఆస్కారం ఉంటుంది. కమర్షియల్ దృష్టిలో పెట్టుకుని కొంత మంది దర్శకులు, నిర్మాతలు అవసరం లేని కామెడీ, పాటలు ఇంకా కొన్ని సన్నివేశానికి అవసరం లేని సీన్ లు పెడుతూ ఉంటారు. కానీ అదృష్టం ఏంటి అంటే ఈ సినిమాలో అలాంటి వాటికి చోటు ఇవ్వలేదు. కానీ చెప్పాలనుకున్న కథను ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు శక్తిప్రతాప్ సింగ్ కొంచం అనుకున్న స్థాయిలో చూపించలేకపోయారు అనిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పేలవంగా, కథ కొంచం స్లోగా అనిపించింది. దానితో పోల్చితే సెకండ్ హాఫ్ చాలా బెటర్. దేశాన్నే కుదిపేసిన పుల్వామా వంటి సంఘటనలు మరింత హత్తుకునేలా తీసి ఉండాల్సింది. ఎమోషన్ సీన్స్ ను, మెలో డ్రామాను పూర్తి స్థాయిలో పండించడంలో దర్శకుడు తడబడ్డాడు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కథాంశం ఏమిటీ, ఎలా ఉండబోతోంది అనే విషయంలో ప్రేక్షకులకు ముందు నుంచీ ఓ క్లారిటీ ఉంది. దాంతో ఆ మైండ్ సెట్ తో థియేటర్లకు వచ్చిన వారికి ఈ సినిమా బాగానే ఉందనిపిస్తుంది. అలా కాకుండా వీరోచితమైన పోరాట దృశ్యాలను ఊహించి వచ్చేవారు కొంత మేర నిరాశకు కలుగుతుంది. దర్శకుడుకు ఇది మొదటి సినిమానే అయినా… ప్రధాన తారాగణం నుండి చక్కని నటనను రాబట్టుకోగలిగాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతనికి ఇది బెస్ట్ బాలీవుడ్ ఎంట్రీ అనుకోవచ్చు. అలానే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మానుషీ చిల్లర్ కూడా బాగానే నటించింది. నవదీప్ పాత్ర అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. ఇతర పాత్రలను రుహానీ శర్మ, మీర్ సర్వర్, సంపత్ రాజ్, అభినవ్ గోమఠం, పరేష్ పహూజా, అలీ రజా తదితరులు పోషించారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం అందించాడు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. వందేమాతరం సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ఎంత మేరకు విజయాన్ని సాధించింది అనే విషయాన్నీ పక్కన పెడితే, నటుడిగా వరుణ్ తేజ్ కు మంచి గుర్తింపును ఇస్తుంది. తారాగణం అంతటికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఓ మంచి విష్యాన్న్ని ప్రేక్షకులకు చూపించాలి అనుకున్న సోనీ పిక్చర్స్ ని అభినందించాలి.

రేటింగ్ : 3 / 5

ఆపరేషన్ వాలెంటైన్… ఫస్ట్ హాఫ్ కొంచం స్లో కావచ్చు కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది.