
iBomma వెబ్‌సైట్ పోలీసులను బహిరంగంగా హెచ్చరిస్తూ సంచలన ప్రకటన విడుదల చేసింది. వారి సైట్‌ను బ్లాక్ చేస్తే యూజర్ల ఫోన్ నంబర్లు, సబ్‌స్క్రిప్షన్ వివరాలు బయటపెడతామని బెదిరిస్తోంది. హీరోలు, మీడియా, OTTలకు సంబంధించిన షాకింగ్ సమాచారం బహిర్గతం చేస్తామని హెచ్చరిస్తోంది.
iBomma తమ వద్ద 5 కోట్ల మంది యూజర్ల సమాచారం ఉందని, పోలీసులు తమ సైట్‌ను టార్గెట్ చేస్తే అందరి వివరాలు బహిర్గతం చేస్తామని బెదిరిస్తోంది. వారి సర్వర్లు ఎక్కడున్నాయో కనుగొనడం అసాధ్యమని, గ్లోబల్ నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నామని సవాల్ విసురుతోంది. ఒక ప్రముఖ హీరో కూడా తమ సైట్‌ని సబ్‌స్క్రైబ్ చేశారని, అతని పేరును బయటపెడతామని హెచ్చరిస్తోంది. ఇండస్ట్రీలోని పెద్ద స్టార్ల ఇమేజ్‌కు ఊహించని షాక్ తగులుతుందని హెచ్చరిస్తోంది. ఒక్కో యూజర్ ఫోన్ నంబర్‌తో పాటు వారి సబ్‌స్క్రిప్షన్ రికార్డులు తమ డేటాబేస్‌లో ఉన్నాయని పేర్కొంది. పోలీసుల చర్యలు తమను ఆపలేవని, ఇండియా మొత్తంలో తమకు సపోర్ట్ ఉందని చెబుతోంది. ఒకవేళ తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే, మీడియా, OTT ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుందని బెదిరిస్తోంది. ఈ బెదిరింపులు ఎప్పుడు వచ్చాయో స్పష్టంగా తెలీదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. ఈ సంచలన హెచ్చరికలతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది.
