కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘గ్రౌండ్’ సినిమా – ‘గ్రౌండ్’ గల్లీ క్రికెటర్స్ సినిమా

ఈ వారం వచ్చిన సినిమాలలో ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా గ్రౌండ్. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయినా సినిమా మీద పాషన్ తో సూరజ్ తానే నిర్మాత దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా గ్రౌండ్. ఈ సినిమాకి పని చేసిన వాళ్ల నుంచి నటించిన వాళ్ల వరకు అందరూ కొత్తవాళ్లే. ఈ సినిమా ఆదివారం వస్తే గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళందరికీ నచ్చుతుంది. ఒకే రోజు ఒకే గ్రౌండ్ లో జరిగిన సంఘటనలని మన కళ్ళముందే జరిగినంత న్యాచురల్ గా చిత్రీకరించారు. ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కి ప్రాముఖ్యత ఉంది.

కథ :
తెలుగు సినిమా రొటీన్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉంటుంది గ్రౌండ్ సినిమా. ఆదివారం వస్తే గల్లీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళు కథ. అలా ఒక ఆదివారం గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్న కుర్రాళ్ళకి అక్కడే ఆడుతున్న వేరే గ్రూప్ తో ఎదురైన సమస్యని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. నాచురల్ లైట్ లో మన కళ్ళు ఎదురకుండా జరుగుతున్నట్టుగా నాచురల్ గా చిత్రీకరించారు. మన చుట్టుపక్కల వినిపించే కామన్ శబ్దాలనే మ్యూజిక్ బ్యాగ్రౌండ్ గా తీసుకున్నారు.

నటీనటులు :
క్రికెట్ టీం కెప్టెన్ గా హీరో గా హరి అలాగే అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా నటించారు. హీరోయిన్గా తేజస్విని నటన బాగుంది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. తన ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన దుర్గా నటన బాగుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నాగరాజు నటన బావుంది. చెల్లి క్యారెక్టర్ లో చేసిన ప్రీతి (చిన్ను) క్యారెక్టర్లు ఆ గ్యాంగ్ అందరిని ఆటపట్టించే క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది.

టెక్నికల్ :
సూరజ్ తానే నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ మొట్టమొదటి సినిమా అయినా తన బుజాల పైన గ్రౌండ్ సినిమాని చిత్రీకరించాడు. చిన్న కథ అయినా రొటీన్ కి భిన్నంగా నేచురల్ గా తీశాడు. జహీర్ భాషా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పనితీరు బాగున్నాయి. విజయ్ గట్టు అందించిన కథ బాగుంది. మ్యూజిక్ కూడా నేచురల్ గా దగ్గరగా ఉండేలాగా చూసుకున్నాడు. భాస్కర్ అందించిన మ్యూజిక్ బాగుంది.

పాజిటివ్స్ :
– తక్కువ నిడివి

-కొత్త వాళ్ళైనా కొత్తగా కొంచం భిన్నంగా చిత్రీకరించారు

– ప్రతి పాత్రని బాగా చూపించారు

నెగిటివ్స్ :
-అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్స్ ఉండడం

ఒక్క మాటలో చెప్పాలి అంటే గల్లీ క్రికెటర్స్ సినిమా

రేటింగ్ : 3/5