హీరోయిన్‌గా ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్

Avantika Sundar

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఇప్పుడు ఆమె కుమార్తె అవంతిక సుందర్ సినీ రంగప్రవేశం చేస్తున్నారు. అవంతిక సుందర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న మొదటి చిత్రం ‘ఆరంభం’. సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మలయాళ చిత్రంలో ఆమె ‘ఆరతి’ అనే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ భాషలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. సుమారు 35 ఏళ్ల క్రితం ఖుష్బూ కూడా మలయాళ సినిమాతోనే తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు తల్లి బాటలోనే నడుస్తూ, అవంతిక కూడా మలయాళ పరిశ్రమ ద్వారానే తన కెరీర్‌ను ‘ఆరంభం’ చేస్తున్నారు. గ్లామర్ తారగా దక్షిణాదిని ఏలిన ఖుష్బూ లాగే, ఆమె కూతురు కూడా వెండితెరపై విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.