
కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన కన్నడ భాషపై వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌లో కమల్, కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించిందని చెప్పడం కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఈవెంట్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్నప్పటికీ, కమల్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై శివరాజ్ కుమార్ స్పష్టత ఇచ్చారు.
“కమల్ వ్యాఖ్యల సమయంలో నేను చప్పట్లు కొట్టలేదు. ఎడిటింగ్ లోపం వల్ల తప్పుగా చూపించారు. వేరే స్పీచ్‌కు నేను చప్పట్లు కొట్టాను,” అని శివరాజ్ వివరించారు. కన్నడ భాషపై తనకు గౌరవం ఉందని, అది తన మాతృభాష అని గర్వంగా చెప్పారు. “కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తా. కమల్ సీనియర్ నటుడు, ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ, భాషా విషయంలో నా స్థానం స్పష్టం,” అని శివరాజ్ స్పష్టం చేశారు.
