
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రంతో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన ఈ హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, భయపెడుతోంది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ, శ్రియా కొంతంతో పాటు శ్రావణి, శాలిని లాంటి యువ నటీనటులు అదరగొట్టారు. తొలిరోజు సాధారణ కలెక్షన్స్‌తో మొదలైన ‘శుభం’, ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.5.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్లింది. ఈ విజయంతో సమంత టీమ్ సంబరాలు చేసుకుంటోంది. “ఇది బ్లాక్‌బస్టర్ హిట్.. ప్రేక్షకుల ఆదరణ అద్భుతం” అని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. సమంత నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం హాస్యం, భయానక అనుభూతులను సమపాళ్లలో అందిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమా ఫుల్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? సమంత నిర్మాతగా మరిన్ని విజయాలు అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘శుభం’ సక్సెస్‌తో సమంత సత్తా చాటిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.
