సిఎం రేవంత్ రెడ్డిని మహేష్ బాబు కలవడానికి కారణం ఏంటి?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇటీవల భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఆ వరదలు వల్ల నష్టం ఏర్పడింది. దానికై మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఈరోజు విరాళం ప్రకటించిన 50 లక్షల రూపాయలు చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేయడం కోసం తన భార్య నమ్రత గారితో కలిసి చెక్కును అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఏఎంబి తరఫున మరో 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల కోసం ఎన్నోసార్లు విరాళాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.