“తెరచాప” చిత్ర రివ్యూ & రేటింగ్

Therachaapa

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, నాగ మహేష్, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ఇక నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక ప్రాంతంలో వివశించే కొంతమంది జాలరులు ఒక సమస్య వల్ల మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర తీరాన ఉండడానికి ఆశ్రయం ఇస్తారు. అలా సజావుగా నడిచిపోతున్న వారి జీవితాలలోకి కొన్ని అంతుచిక్కని సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చిన సమస్యలకు పరిష్కారం తెలుసుకొని దిశగా వారిలో ఒకడు బయటికి వచ్చినప్పుడు అతనిని అంతం చేస్తారు. అసలు వారికి వచ్చిన సమస్య ఏంటి? అంతమైపోయిన ప్రయత్నాన్ని తిరిగి ఎవరు మొదలుపెడతారు? చివరికి ఆ సమస్య తీరుతుందా లేదా? దానికి ఉన్న రాజకీయ కోణాలు ఎటువంటివి? అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై తెరచాప చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో హీరోగా నటించిన నవీన్ రాజ్ (ఈశ్వర) కాస్త కొత్త నటుడు అయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ అందించారు. అలాగే చిత్రంలో హీరోయిన్స్ పాత్రలు పోషించిన పూజ, శ్రీలు తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ కథకు కావలసిన బలాన్ని చేకూర్చి తమను ప్రూవ్ చేసుకున్నారు. అలాగే చిత్రంలో కీలకపాత్రను పోషించిన రాజీవ్ కనకాల, నాగ మహేష్, జగదీష్, పృథ్వీరాజ్ తదితరులు కథలో తమ పాత్రలకు తగ్గట్లు ఇచ్చి సినిమాలో తమదైన ప్రాధాన్యతను చూపించారు. అలాగే జబర్దస్త్ నటలు రైజింగ్ రాజు, అశోక్, నాగి, అప్పారావు మంచి కామెడీతో పాటు తగ్గ పర్ఫార్మెన్స్ అందించారు. స్వర్గీయ ఫిష్ వెంకట్ గారు ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక సాధారణ కథను ప్రేక్షకులకు ఎంగేజ్ చేస్తూ వెండితెరపై చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. అటువంటి ఓ అతి సామాన్యమైన కథను వెండితెరపై చూపించడంలో దర్శకులు జార్జ్ సక్సెస్ అయ్యారు. సంగీతం, విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్నిచోట్ల లిప్సింక్ అంతగా లేనప్పటికీ కథలో లీనమవడంతో ప్రేక్షకులు అంతగా పట్టించుకునే విధంగా లేదు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
మత్స్యకార కుటుంబాలను, వారు పడే కష్టాలను, వారి జీవితాలను,ఒక మత్తు పదార్థాలు వంటివి ఒకరి జీవితంలోకి వస్తే ఆ కుటుంబాలు ఎటువంటి సంఘర్షణలకు లోనవుతాయి అనే విషయాలను నేటి సమాజానికి అర్థమయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. కుటుంబ విలువలు, స్నేహ బంధాలు, రాజకీయ కోణాలు, ప్రేమలు, పగలు వంటి ఎన్నో వాటితో ముడిపడి ప్రేక్షకులు పెట్టిన టికెట్ కు ఖచ్చితమైన న్యాయం చేస్తూ ఎన్నో విలువలు నేర్పే సమ్మర్ ఎంటర్టైనర్ గా తెరచాప సినిమాగా నిలిచిపోతుంది. ఓటిటిలలో మంచి ఆదరణ పొందే విధంగా ఉంది.

ప్లస్ పాయింట్స్ :
కథ, విజువల్స్, క్లైమాక్స్, లొకేషన్స్.

మైనస్ పాయింట్స్ :
కొన్ని సాంకేతిక లోపాలు, కొంతమంది కొత్త నటీనటులు.

సారాంశం :
మత్స్యకారుల జీవితాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఎన్నో విలువలతో కూడిన ప్రస్తుత పరిస్థితులను ప్రతిభందిస్తూ కుటుంబ సమేతంగా వేసవి సెలవులలో చూసి ఎంటర్టైన్ చేసే చిత్రం తెరచాప.

రేటింగ్ : 3/5