కష్టపడకుండా వచ్చే డబ్బు తెచ్చే కష్టాలు ఎలా ఉంటాయో తెలుపుతూ వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘కిస్మత్’

Screenshot 2024 02 03 160146

బిటెక్ చదువుకుని కాలిగా ఉండే ఈ కాలం కుర్రాళ్ళ మద్య జరిగే కథని సినిమాగా వచ్చినదే కిస్మత్ సినిమా.

సినిమా రివ్యూ : సినిమాకి వస్తే ముఖ్య పాత్రలుగా చేసిన నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ, రియా సుమన్, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ చేసారు. శ్రీనాధ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 2వ తేదీన రిలీజ్ కావడం జరిగింది.

కథ : నరేష్, అభినవ్, విశ్వదేవ్ ముగ్గురు బిటెక్ చదివి ఒకే ఊరుకు చెందిన ముగ్గురు కలిగే ఉండే మిత్రులు. వీళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి జాబ్ ట్రయిల్స్ చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో నరేష్ కు రియా పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. రాజకీయ నాయకుడు అయినా అజయ్ ఘోష్ దగ్గర పని చేసే టెంపెర్ వంశితో పరిచయం కావడం,అదే పరిచయంలో ర్యాలీకి వెళ్తే డబ్బులు వస్తాయ్ అని తెలిసి ఆ ర్యాలీకి వెళ్లడం జరుగుతూ ఉంటది.
ఇలా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం వచ్చేలా చేస్తా అని, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనడంతో డబ్బు కోసం ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి డబ్బు కాజేసే ప్రయత్నంలో వాళ్లకి 2 కోట్లు దొరుకుతాయి. అదే సమయంలో అజయ్ ఘోష్ 2 కోట్లు పోవడం జరుగుతుంది. అలా మలుపు తిరిగిన వారి జీవితంలో తరువాత ఆ డబ్బు వళ్ళ వారికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాల్లో నుండి ఎలా బయట పడ్డారు, అవసరాల శ్రీనివాస్ వీళ్ళ జీవితంలోకి ఎలా వచ్చారు, అని తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ అంత కామెడీగా ఊర్లో, ఇంకా హైదరాబాద్ వచ్చాక వారి ప్రయాణంతో ఉండగా, డబ్బు దొరకడం తో ఇంటర్వెల్ వస్తుంది. ిన సెకండ్ హాఫ్ కి వస్తే వస్తే ఆ డబ్బుతో వారికి వచ్చే కష్టాలు, ఆ డబ్బు కోసం వెతకడం, కాంఫుసే లేకుండా టామ్ & జెర్రీ ఫైట్ ల అనిపిస్తుంది. అయితే కథలో ముఖ్యంగా బిటెక్ చదివి ఖాళీగా ఉండే వాళ్ళు, జాబ్స్ లేకపోవడం, గవర్నమెంట్ ఇచ్చే ఫీజ్ రీయింబర్సమెంట్స్ కోసం పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలపై చర్చించాడు. ఈ సీరియస్ విషయాన్ని కూడా కామెడీతో బాగా చూపించాడు. అలాగే క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో సినిమాని ముగిస్తారు.

నటీనటులు : సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేసారు. అందరూ నవ్విస్తూ మంచి కామెడీ టైమింగ్ తో అదరకొట్టారు అని చెప్పుకోవచ్చు. సమీర్ చివరిలో వచ్చి మంచి ట్విస్ట్ ఇస్తారు.

సాంకేతిక విశేషాలు : ఈ సినిమాకు కథ, కథనం, డైలాగ్స్ కూడా కామెడీ పండేలాగా పిసినేమాకి ప్లస్ గా ఉన్నాయి . సెకండ్ హాఫ్ లో డబ్బు కోసం అందరూ వెతికే కన్ఫ్యూజన్ కథనం కూడా క్లారిటీగా రాసుకున్నారు. కెమెరా విజువల్స్, నిర్మాణం విలువలు బాగానే ఉన్నాయి. కామెడీకి సెట్ అయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికి ఈ సినిమా బిటెక్ చదివే కుర్రాళ్ళ జీవితాలు చూపిస్తూ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

రేటింగ్ : 3/5