
సందీప్ పొడిశెట్టి నిర్మాణ దర్శకత్వంలో సచిన్ రామ్ ప్రతాప్ హీరోగా విశ్వ అక్షర హీరోయిన్గా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ప్రేమ కలహం. ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా మొదలయ్యింది. మల్లికార్జున్ డిఓపిగా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎమ్మెన్నార్ ఎడిటర్ గా చేస్తుండగా చిత్రానికి సంగీతాన్ని కూడా సందీప్ పొడిశెట్టి అందించడం విశేషం.
లవ్ అండ్ ఎమోషన్ జోనర్లో రానున్న ఈ చిత్రం ప్రారంభిస్తున్న ఈ క్రమంలో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ… “ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది అని ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను” అన్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, నటీనటులు, అలాగే ఇతర సాంకేతిక బృందం హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నటీనటులు : సచిన్ రామ్ ప్రతాప్, విశ్వ అక్షర.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం – సందీప్ పొడిశెట్టి
డిఓపి – మల్లికార్జున్
ఎడిటర్ – ఎంఎన్ఆర్
సంగీతం – సందీప్ పొడిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – సింహాచలం టి
కాస్ట్యూమ్ డిజైనర్ – సోము ఆర్
వీఆర్వో – జె దుర్గా ప్రసాద్