పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Screenshot 2024 09 20 200149

నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తన సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి X ద్వారా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇలా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు… మీ ప్రెస్ మీట్ నేను ఇప్పుడే చూడటం జరిగింది. నేను చెప్పింది ఏమిటి? దానిని మీరు అర్థం చేసుకున్నది ఏంటి? నేను చెప్పినదాని అపార్థం చేసుకుని చెప్పడం ఏంటి? నేను ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం విదేశాలలో ఉన్నాను. ఈనెల 30వ తేదీ తర్వాత తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు నేను సమాధానం చెబుతాను. మీకు వీలైతే మరొకసారి నాటు వీటిని మళ్లీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ గారు అన్నారు.