యూట్యూబ్ లో ఎంతో ఫేమస్ అయిన యువకుడు ప్రముఖ యూట్యూబ్ హర్ష సాయి. హర్ష సాయి పేదవారికి సహాయం చేస్తూ డబ్బు పంచడం లేదా వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం లాంటి వీడియోలు సాధారణంగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అయితే ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేసినట్లు ఆమె ఆ కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాకుండా తన దగ్గర నుండి సుమారు రెండు కోట్ల వరకు తీసుకున్నాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిని అంతటినీ పోలీసులు స్టేట్మెంట్లో రికార్డ్ చేసుకున్నారు. అయితే గతంలో కూడా హర్ష సాయి కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా అలాగే మరికొన్ని ఇల్లీగల్ మార్గాలలో డబ్బు సంపాదిస్తాడంటూ కొంతమంది కొన్ని టీవీ ఛానల్ లో డిబేట్లు కూడా చేయడం జరిగింది.
అంతేకాక హర్ష సాయి స్వీయ రచనా దర్శకత్వంలో నటిస్తూ మెగా లో డాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఆ సినిమాను కూడా బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మిత్ర శర్మ హీరోయిన్గా నటిస్తూ స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని గతంలో ప్రకటించడం జరిగింది.