
ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ సిరీస్‌తో సంచలనం సృష్టించిన నటుడు దివ్యెందు శర్మ, మున్నా భయ్యాగా కీలక పాత్రలో నటిస్తున్నారు.
మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దివ్యెందు క్రికెట్ బాల్‌తో మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఆయన ‘రామ్ బుజ్జి’ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. 2026 మార్చి 27న ‘పెద్ది’ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.