‘ఓజి’ సెట్స్‌లో పవన్.. షూటింగ్ షెడ్యూల్ రెడీ

Screenshot 2025 05 13 084722

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్‌మెంట్ నుంచే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, పవన్ కళ్యాణ్ మే 14 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. జూన్ 10 నాటికి తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. సోషల్ మీడియాలో చిన్న అప్‌డేట్‌కే ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ‘ఓజి’తో పవన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడని అభిమానులు ధీమాగా ఉన్నారు