
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. రాజకీయాలు, సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్న పవన్, ఈ ప్రాజెక్ట్ కోసం చూపిన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా, ‘ఓజీ’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత, రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు నాన్‌స్టాప్ డబ్బింగ్ పూర్తి చేశారు. నాలుగు గంటల్లో ఈ పనిని ముగించడం అంటే సామాన్యమైన విషయం కాదు! ఈ కమిట్మెంట్తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #HariHaraVeeraMallu హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఇప్పుడు జ్యోతి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్‌తో ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో VFX వర్క్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కోసం చూపిన డెడికేషన్ అభిమానుల్లో గౌరవాన్ని మరింత పెంచింది. ‘హరిహర వీరమల్లు’ పవన్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది