బాలీవుడ్ స్టార్స్‌పై మహారాష్ట్ర పోలీస్ వ్యంగ్యం

Screenshot 2025 05 15 090344

ఇటీవల దేశంలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్-పాకిస్తాన్ యుద్ధ చర్చల నేపథ్యంలో సౌత్ సినీ తారలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, బాలీవుడ్ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అక్షయ్ కుమార్ తప్ప, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోణ్, అలియా భట్ వంటి స్టార్స్ నిశ్శబ్దంగా ఉండటం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర పోలీస్ సోషల్ మీడియాలో ఓ వ్యంగ్యాస్త్రం సంధించారు. బాలీవుడ్ స్టార్స్‌ను లక్ష్యంగా చేసుకుని, వారి ఏఐ ఫొటోలతో ఓ సెటైరికల్ పోస్టర్ విడుదల చేశారు. “ప్రియ సెలబ్రిటీలు, ఇప్పుడు సేఫ్! ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి రండి. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్‌ను ఇక కలవరపెట్టాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ గొంతు ఎక్కడ?” అని రాసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో నెటిజన్లు మరోసారి బాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.