లేటెస్ట్ పవన్ కళ్యాణ్ కుమార్తె ఫోటోలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం జరిగిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టడం జరిగింది. నేడు ఆ ప్రాయశ్చిత్త దీక్ష ముగుస్తున్న సందర్భంగా నిన్న అలిపిరి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేరుకోవడం జరిగింది. నేడు స్వామివారిని దర్శించుకోమన్నారు. ఈ సందర్భంగా తనతో పాటు వచ్చిన తన కుమార్తెలు ఆద్య, పలీనా అంజని ఇరువురను స్వామివారి దర్శనం నిమిత్తం వారు హిందూ మతస్తులు కాకపోవడం వల్ల డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టించడం జరిగింది. అయితే రెండవ కుమార్తె మైనర్ కావడంవల్ల తండ్రి స్థానంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ డిక్లరేషన్ పైన సంతకం చేశారు. హిందూ మతస్థులు కాని వారు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకోవడం అనాధకాలంగా వస్తున్న పద్ధతి. అయితే తాను ప్రాయశ్చిత్త పూజ చేసినప్పటికీ తన కుమార్తెల స్వామివారి దర్శనం పవన్ కళ్యాణ్ ఈ డెకరేషన్ బై సంతకం పెట్టే పద్ధతిని పాటిస్తూ తమ కుమార్తెలను స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరిగింది.