
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రూ.50 కోట్లకు అమ్ముడవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఎమోషనల్ డ్రామాతో, లోతైన కథాంశంతో ‘కుబేర’ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ భారీ డీల్ సినిమా బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్-నాగార్జున కాంబినేషన్, రష్మిక గ్లామర్‌తో ‘కుబేర’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు