
జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తూ కొరటాల శివ దర్శకతంగా ఈనెల 27న వస్తున్న సినిమా దేవర. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగు మీడియాతో దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారితో మీ సంబంధం ఎలా ఉంది అని అడగగా దానికి దర్శకుడు కొరటాల శివ సమాధానం ఇస్తూ ఇలా అన్నారు. చిరంజీవి గారితో మొదటి నుండి నాకు మంచి స్నేహమే ఉంది. ఆచార్య సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించినప్పుడు నాకు అందరికంటే ముందుగా చిరంజీవి గారు మెసేజ్ చేశారు. “You will bounce back Shiva” అని చిరంజీవి గారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికి కూడా చిరంజీవి గారు అంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం అని అన్నారు.