ప్రేక్షకులను అలరిస్తూ కేవలం 49 రూపాయలకే ‘కన్యక’ సినిమా

WhatsApp Image 2024 08 27 at 08.10.53 5b48831a

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ Bcineet సమర్పించు కన్యక అనే చిత్రం నకరికల్లు నరసరావుపేట చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం యొక్క ఆడియో ఆగష్టు 15 న రిలీజ్ అయింది. ఈ చిత్రం ఇప్పుడుు Bcineet OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం 49 రూపాయలు Rental amount పేచేసి సినిమాను చూడొచ్చు అని నిర్మాతలు KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు.
ఆగష్టు 20 న రాఖీ పండుగ సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ నరసరావుపేట MLA శ్రీ చదలవాడ అరవింద బాబు గారు రిలీజ్ చేసారని మరియు చిత్రం యొక్క వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చంట్ అసోసిషన్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు చిత్రం లోని రెండవపాట సుబ్బరాయ గుప్త గారు రిలీజ్ చేసారు అని First movie ticket launch కార్యక్రమం శ్రీశైలం ఆ భ్రమరాంబ మల్లిఖార్జుని స్వామి సన్నిధిలో వాసవి సత్రంలో వాసని సత్ర సముదాయాల అధ్యకులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదగా చీతీరాల పెద్దన్న గారు మరియు ఆర్య వైశ్య ప్రముఖల సమక్షంలో జరిగింది అని
చిత్ర దర్శకుడు రాఘవ తెలిపాడు.
Bcineet ద్వార వినాయక చవితికి అన్ని OTT ల్లో సినిమా రీలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుందని అనే పాయింట్ తో వస్తున్నా ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, RMP వెంకటశేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి

మేకప్ : రెడ్డప్ప రెడ్డి

మాటలు : వెంకట్.టి

పాటలు : విజయేంద్ర చేలో

గాయని : పూర్ణిమ
సంగీతం : అర్జున్

రీ రికార్డింగ్ : నరేన్
సౌండ్ ఎఫెక్ట్స్& మిక్సింగ్ : పరుశురామ్
కెమరామెన్ : రాము, తరుణ్
ఎడిటర్ & కలరిస్ట్ : సుభాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : DK బోయపాటి
నిర్మాతలు : KV అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివరావు
రచన దర్శకత్వం : రాఘవేంద్ర తిరువాయి పాటి