
కన్నడ సినిమా కాంతార సీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రిషబ్ శెట్టి మరోసారి తనదైన మ్యాజిక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ టచ్‌తో ఈ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది.
‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ‘నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు?’ అనే ప్రశ్నతో మొదలైన ఈ ట్రైలర్, 2 నిమిషాల 57 సెకన్ల పాటు ఆకట్టుకుంటుంది. షార్ప్ షాట్స్, బలమైన బీజీఎమ్, నేటివిటీ టచ్‌తో కూడిన ఎమోషనల్ కంటెంట్ ట్రైలర్‌ను ప్రత్యేకం చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం, నటనతో పాటు మేకింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది. ప్రతి షాట్ ఉత్కంఠను కలిగిస్తూ, ప్రేక్షకులను కథలో లీనం చేస్తుంది. రుక్మిణి వాసంత్ అందమైన యువరాణిగా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది
