ఆర్టిస్టులకు తొలి పరిచయంగా మారిన జబర్దస్త్ వేదిక

తెలుగు బుల్లితెర‌పై సెన్సేష‌న్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌. 600కి పైగా ఎపిసోడ్స్‌తో ఇప్ప‌టికీ నిర్విరామంగా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుందీ షో. కేవ‌లం టీవీ రంగంలోనూ కాదు, వెండితెర‌పై కూడా జ‌బ‌ర్ద‌స్త్ మార్క్ ఇప్పుడు క‌నిపిస్తుండ‌టం విశేషం. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది ప్ర‌తిభావంతుల‌ను ఈ షో సినీ రంగానికి ప‌రిచ‌యం చేసింది. సుడిగాలి సుధీర్‌, స‌త్య‌, ధ‌న్‌రాజ్‌, మ‌హేష్‌, గెట‌ప్ శ్రీను, ష‌క‌ల‌క శంక‌ర్ ఇలా అంద‌రూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

వీరంద‌రూ మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం, కార్తికేయ‌, భాగ‌మ‌తి, విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, హ‌నుమాన్‌, స‌ర్ వంటి చిత్రాల్లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ అల‌రించారు. ఇంకా హైప‌ర్ ఆది, చ‌మ్మ‌క్ చంద్ర‌, అప్పారావు, తాగుబోతు ర‌మేష్‌, ఆటో రామ్ ప్ర‌సాద్‌, రోల‌ర్ ర‌ఘు, చంటి వంటివారు తమ ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వుల విందును పంచుతున్నారు.