
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఓజి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. అయితే, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో చూస్తున్న ఓజి సినిమా సమయంలో ఘటన చోటుచేసుకుంది. థియేటర్‌లో స్పీకర్ బాక్స్ పడడంతో ఇద్దరు ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సామర్థ్యానికి మించి 1200 మంది ప్రేక్షకులను అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయిందని, టికెట్ లేకుండా చాలా మంది చొరబడ్డారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంపై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
