
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లకు పెట్టింది పేరైన హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, హృతిక్ లాంటి నటుడితో పనిచేయడం తమ విజన్‌కు కొత్త ఊపిరి అన్నారు. హృతిక్ రోషన్ ఈ సందర్భంగా, హోంబలే ఫిల్మ్స్ గొప్ప కథలతో సినీ ప్రియులను ఆకర్షిస్తోందని, ఈ ప్రాజెక్ట్‌తో అభిమానులకు మరపురాని అనుభూతిని అందిస్తామని చెప్పారు. ‘KGF’, ‘సలార్’, ‘కాంతార’ లాంటి హిట్స్‌తో హోంబలే ఇప్పటికే సంచలనం సృష్టించింది. హృతిక్ యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండర్తో కూడిన పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం ‘వార్ 2’, ‘క్రిష్ 4’లో బిజీగా ఉన్న హృతిక్, ఈ కొత్త సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.