‘హరిహర వీరమల్లు’ మూడో పాట – పవన్ కళ్యాణ్ విజువల్స్‌తో గూస్‌బంప్స్

WhatsApp Image 2025 05 21 at 11.55.30 aa9c6148

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా నుంచి మూడో పాట ‘అసుర హననం’ విడుదలైంది. కీరవాణి స్వరాలు, రాంబాబు గోసల సాహిత్యంతో ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.