
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ క్రేజ్ మరోసారి ఊపందుకుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. తాజాగా మే 21న పవర్ఫుల్ టైటిల్ ట్రాక్ లేదా థీమ్ సాంగ్ విడుదల కానుందని సమాచారం. ఈ సందర్భంగా పాన్ ఇండియా మీడియాతో ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్‌ను ఆరు వారాలు జరిపిన మేకర్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో థియేటర్లలో గూస్బంప్స్ రేపేలా సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 12 నాటికి ఈ సినిమా సందడి గట్టిగా ఉంటుందని టాక్. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.