
హీరోగా వరుస విజయాలు అందుకుంటూనే నిర్మాతగా సత్తా చాటుతున్నాడు నాని. కోర్ట్, హిట్-3 చిత్రాలతో నిర్మాతగా మెప్పించిన నాని, ఇప్పుడు కోర్ట్ దర్శకుడు రామ్ జగదీష్‌తో మరో చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్, ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాని నిర్మాణంలో రామ్ జగదీష్ సినిమా లాక్ కానుంది. కథా చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, త్వరలో ప్రాజెక్ట్ ఖరారు కానుందని తెలుస్తోంది. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించిన నాని, ఇప్పుడు దుల్కర్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. నాని నిర్మాతగా మరెన్ని విజయాలు అందిస్తాడో చూడాలి.