గ్లామర్ వదిలి సన్యాస మార్గంలో బాలీవుడ్ అందాల తార

maxresdefault 1

ఒకప్పుడు బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్‌లతో సమానంగా మెరిసిన హీరోయిన్ బర్ఖా మదన్ ఇప్పుడు సన్యాస జీవితంలో మునిగిపోయింది. 1996లో ‘ఖిలాడియోన్ కా ఖిలాడీ’తో అక్షయ్ కుమార్, రవీనా టాండన్‌లతో కలిసి తెరంగేట్రం చేసిన ఆమె, ఆ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘భూత్’లో భయానక పాత్రతో మరోసారి సత్తా చాటింది. అజయ్ దేవగన్, ఊర్మిళలతో నటించిన బర్ఖా గుర్తింపు పొందింది. 2005-09 మధ్య ‘సాత్ ఫేరే’ సీరియల్‌తో టీవీలోనూ ఆకట్టుకుంది. 2010లో నిర్మాతగా మారి ‘సోచ్’, ‘సుర్ఖాబ్’ చిత్రాలను రూపొందించింది. కానీ, 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించి సినీ రంగానికి దూరమై, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ పర్వతాల్లో సన్యాస జీవితం గడుపుతోంది. గ్లామర్ ప్రపంచాన్ని త్యజించి ఆధ్యాత్మికతను ఎంచుకున్న బర్ఖా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.