కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ రెడ్డి

తెలుగు చిత్ర నటుడు, ఇటీవలే నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ మామ గారు చంద్ర శేఖర్ గారు ఇటీవలే తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. చంద్ర శేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు వార్తలు వినిపించడం, అలాగే ఆయన మల్కాజ్ గిరి సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా సీటు కూడా ఖరారు అయినట్లు మాటలు వినిపిస్తున్నాయి.
అయితే మామ కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతారు అని, మామ తరుపున ప్రచారం చేసి తన విజయానికి తప్పకుండ సహాయపడతారు అని అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి అంటున్నారు. ఇక ఎం జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.