
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘AA22’ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. 2027 పొంగల్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభం కానుంది. ససీజీ వర్క్‌ల కోసం ఏడాది పొడవునా షెడ్యూల్ రూపొందించారు. ఆరు నెలల్లో ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం తీవ్ర శిక్షణ తీసుకుంటున్నారు. బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. అట్లీ కెరీర్లో ఆరో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా అభిమానులకు విజువల్ విందుగా నిలవనుంది.