“అక్కడ వారు ఇక్కడ ఉన్నారు” సినిమా రివ్యూ

WhatsApp Image 2024 05 19 at 19.08.11 d15e5fd7

త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి గారు. హారర్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. జగదీశ్ రాజ్, సాయి హర్షిని, కరణం ఈశ్వర్, పంతుల లలిత, కేవీ రమణ, వట్టిపల్లి శ్రావణ్, సారిక తదితరులు ముఖ్య పాత్రలలో ఈ సినిమాలో నటించారు. సాయి విజ్కి సినిమా నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :
ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు ముందు నుండి టీజర్ ఇంకా ట్రైలర్ లో చూపించినట్లుగానే ఓ మంచి హారర్ థ్రిల్లర్ అని చెప్పుకోవాలి. సారిక స్కూల్ కి వెళ్తుండగా తనకి ఓ చెప్పు తగులుతుంది, ఆ తరువాత నుండి అదే చెప్పు ఎక్కడ చూసిన తనకి కనిపిస్తూనే ఉంటుంది. అదే విధంగా రామయ్య కు ఓ చీపిరి తగిలి అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తరువాత ఏం జరుగుతుంది? ఆ చెప్పు ఇంకా చీపిరి వీరిని ఎక్కడ వరుకు తీసుకుని వెళ్తాయి? అవి వీరిని విడిచిపెడతాయా లేదా? ఆ గ్రామంలో జరిగే కొన్ని భయానక సంఘటనలు చూపిస్తూ, ఆ గ్రామంలోని ఆ సంఘటనల నుండి వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా.

నటీనటులు :
ఈ సినిమాలో నటించిన వారంతా బాగానే నటించారు అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన పాత్రలలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించారు. కొన్ని భయానక సీన్ లలో నటీనటులు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇంకా వారు సహజాంగా నటించిన తీరు బావుంది అనే చెప్పుకోవాలి.

విశ్లేషణ :
నేటి ప్రేక్షకులు హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇంకా సైన్స్ ఫ్రిక్షన్ సినిమాలకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించినట్లుగానే సినిమా కొంచం భయానకంగా ఉన్నపటికీ సస్పెన్సుతో ప్రేక్షకులను సీట్ ఎడ్జిలో కూర్చోపెట్టారు దర్శకులు. తరువాత ఏం అవుతుందో అనే ఒక సస్పెన్సుని సినిమా చూసే వారిలో వచ్చేలా, పూర్తిగా సినిమాలో లీనమై ఉండిపోయేలా దర్శకులు సినిమాను రూపొందించారు. అయితే కొన్ని సీన్లు కొంచం అసంతృప్తి చెందినప్పటికీ పూర్తిగా చూసుకుంటే సినిమా బాగానే ఉంది. చివరికి దర్శకుడు మంచి సస్పెన్స్ థ్రిల్లెర్ ని ప్రేక్షకులకు అందించడంలో విజయం పొందారు.

సాంకేతిక విశ్లేషణ :
సాంకేతికత విషయానికి వస్తే సినిమా దర్శకత్వం ఇంకా స్క్రీన్ ప్లే బావున్నాయి అనే చెప్పుకోవాలి. మంచి ప్రొడక్షన్ విలువలతో వచ్చిన సినిమా ఖాతాలో ఈ సినిమా జాయిన్ అయిపొయింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కలర్స్, లైటింగ్ సినిమాకు తగ్గట్లు అడ్జస్ట్ చేసి ప్రేక్షకులు కన్ను రెప్పలు ఆర్పకుండా చూసేలా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అని చెప్పవచు.

రేటింగ్ : 3/5