నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట ఇలా జరగడ ఎంతో బాధాకరం

1000042488

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రికు నిన్న గుండెపోటు రావడంతో హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ కు తరలించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా ఆమె మృతి చెందారు. కూతురు మరల వార్త విన్న రాజేంద్ర ప్రసాద్ గారు కుప్పకూలి కన్నీరు మున్నీరయ్యారు. గాయత్రి గారు న్యూట్రీషియన్ గా సలహాలు ఇస్తారు. ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. గాయత్రి కి ఒక కూతురు. మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా పాత్రను పోషించింది గాయత్రి కూతురే. 38 సంవత్సరాల చిన్న వయసులోనే గాయత్రి కన్నుమూయడం ఎంతో బాధాకరం. రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి గాయత్రి మరణం ఎంతో విషాదాన్ని కలిగించింది. రాజేంద్రప్రసాద్ కు ఒక కొడుకు, ఒక కూతురు.