
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ… “నేడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను నా టీంతో కలిసి స్వామి నాద నీరాజనం చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ను ఉదయభాను హోస్ట్ చేస్తున్నారు. మాతో నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్య ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాలేనివారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ లో చూడవచ్చు” అన్నారు.
నటి, యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ… “నేటి సాయంత్రం స్వామి వారి సన్నిధిలో అద్భుతమైన కార్యక్రమం నాద నీరాజనం చేస్తున్నాము. నేను తొలిసారి స్వామి వారి సన్నిధిలో కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా కాలంగా అనుకుంటున్నాను, నేడు పిలుపు వచ్చింది. భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని, రాలేని వారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ లో వీక్షించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
