
తిరుపతిలో అత్యంత వైభవంగా జరగనున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని మంత్రి లోకేశ్ ను ఆహ్వానించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్ మంత్రిని కలిసి అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, జాతర విశిష్టతను వివరించారు. మే 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకలకు భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి ఛైర్మన్ ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు.
