మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ అవార్డ్స్ 2025-26 ప్రధానోత్స కార్యక్రమం

1001253723

శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ గత 24 ఏళ్లుగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఒలంపియాడ్ కాంపిటేషన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఒలంపియాడ్ లో గెలుపొందిన విజేతలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు తుమ్మ అమరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, కొండా సురేఖ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యూబ్లడ్ యాప్ సృష్టికర్త డా. జై, జగదీశ్ బాబు యలమంచిలి గారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంతివర్యులు సీతక్క, కొండా సురేఖ చేతుల మీదుగా శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆపత్కాలంలో రక్తం అందుబాటులో లేక ఏటా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న డా. జై, జగదీశ్ బాబు యలమంచిలి సంజీవని లాంటి యూబ్లడ్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉచితంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ తన సేవలను విస్తరించింది. 24*7 ఈ యాప్ నిరంతరంగా దేశవ్యాప్తంగా తన సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో యూబ్లడ్ యాప్ ద్వారా డా. జై, జగదీశ్ బాబు యలమంచిలి గారు అందిస్తున్న సేవలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మంత్రివర్యులు సీతక్క, కొండా సురేఖ కొనియాడారు. భవిష్యత్ లో యూబ్లడ్ యాప్ ద్వారా మరింతగా సేవలను అందించాలని వారు కోరారు.

మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి నమస్కారం. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులను చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్పవారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకోవడం మీ జీవితంలో మర్చిపోలేని సందర్భం అవుతుంది. ఇలాంటి అవార్డ్స్ అందించే స్ఫూర్తితో మీరు జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలి, మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. విద్యార్థులంతా ఇష్టంతో కష్టపడండి. మీకు అసాధ్యమనేదే ఉండదు. మీ సాధనతోనే కుటుంబ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు సాధన చేసి మీ కలలు సాకారం చేసుకునేలా కష్టపడాలని సూచిస్తున్నా. అన్నారు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ – పిల్లలకు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవాటు చేయాలి. అప్పుడే వారి జీవితాలు బాగుంటాయి, మంచి భవిష్యత్ ఉంటుంది. గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ గారి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 24 ఏళ్లుగా విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహించి అవార్డ్స్ అందిస్తున్న తుమ్మ అమరేష్, ఆయన టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలా ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేలా ఈ ఒలంపియాడ్ లను నిర్వహించడం గొప్ప విషయం. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి తెలుసుకుని నేనెంతో ఆనందించాను. మంచి చేస్తే మనల్ని కూడా అభినందిస్తారని అందరూ తెలుసుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రతిభగల పిల్లల్ని మనం వేదిక మీద సన్మానించాం. ఎందుకంటే వాళ్లను చూసి మిగతా పిల్లలంతా స్ఫూర్తి పొందాలి. పిల్లలకు చదువులతో పాటు సంస్కారం నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు, టీచర్స్ తీసుకోవాలి. అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ వెంకట నారాయణ, చిలువరి శంకర్, ఇందిర, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, డా. సింధూర రెడ్డి, డా. తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.