
సమాజంలో మెజార్టీ వర్గాలు బీసీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు..దాపరికమూ లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. అయితే ఆ మేరకు బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కిందా అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి. బీసీలను తమ సంప్రదాయక ఓటు బ్యాంకుగా చెబుతున్న పార్టీలు కూడా న్యాయం చేయలేకపోయాయి. మైనార్టీలు, ఎస్టీ, ఎస్సీలకు ఇచ్చినంత ప్రాధాన్యం బీసీ వర్గాలకు ఇవ్వడంతో విఫలం అయ్యాయి. కాని ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ప్రతిఒక్కరికీ బీసీలపై ఎక్కడలేని ప్రేమ వస్తుంది. ఎన్నికలయ్యాక యథావిధిగా ఇగ్నోర్ చేయడం కూడా జరుగుతుంది.
ఇదొక అన్ ఎండింగ్ పొలిటికల్ స్ట్రాటజీ. గతంలో కొంతమంది బీసీలను ఉద్దరిస్తామని ముందుకొచ్చారు. బీసీల్లో చాలామంది వారిని నమ్మారు. అయితే బీసీల అభ్యున్నతికి వారు ఎంత కృషి చేశారనేది చెప్పలేం కాని..వారు మాత్రం పదవులు దక్కించుకున్నారు.
ఇక జనాభాలో బీసీల లెక్క ఎంత అనేది ఇప్పటివరకు ప్రభుత్వాలు తేల్చలేదు. ఆ లెక్క తేలితే విద్య, ఉద్యోగ, చట్టసభల్లో రావాల్సిన లెక్క పక్కాగా కూడా తేలుతుంది. కాని ప్రభుత్వాలు ఆ పని చేయకపోవడంతో బీసీలకు అన్యాయమే జరుగుతోంది.
అలాంటి పరిస్థితికి చెక్ పెట్టేలా సరికొత్త వ్యూహంతో పోరాటం ప్రారంభిస్తే సంచలనమే కదా. బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న పని అదే. భారత చైతన్య యువజన పార్టీ వేదికగా బీసీల హక్కుల కోసం గళం విప్పారు. ప్రధానంగా ఐదు డిమాండ్లతో శనివారం (ఏప్రిల్ 11)న మంగళగిరిలో ఆమరణ నిరాహార ధీక్ష చేపడుతున్నారు. ప్రభుత్వం ముందుంచిన ఈ ఐదు డిమాండ్లలో స్పష్టత ఉంది. ఇవి సాధారణ డిమాండ్లు మాత్రమే కాదు.. సమానత్వం కోసం అవసరమైన అడుగులు కూడా. కావాల్సిందల్లా ప్రభుత్వం నుంచి ఆచరణాత్మక విధానం అమలు చేయడమే. బీసీలంతా ఐక్యం కావడమే.
ఆయన డిమాండ్లు ఇవే..
1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
2. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి.
3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి.
4. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
5. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి.
బీసీలను ఏకం చేసేలా…
ఇన్నాళ్లు బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతామని చెప్పి పబ్బం గడుపుకున్న వారిని చూసి కొన్ని బీసీ వర్గాల్లో నిరాశ ఆవహించింది. దీంతో నమ్మడం కూడా మానేశారు. కాని బోడే రామచంద్రయాదవ్ ని చూసిన తరవాత, ఆయన పోరాటాన్ని గమనించిన తరువాత బీసీల్లో చలనం వచ్చింది. అన్ని పార్టీలూ బోడే రామచంద్రయాదవ్ వైపు చూడడం ప్రారంభించాయి. అందుకే ఏప్రిల్ 11న ఆయన చేపట్టనున్న ధీక్షపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడితోనే ఆయన ప్రయాణం ఆగలేదు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరిగింది కూడా.
వాస్తవానికి బీసీలను రాజ్యాధికారానికి చేరువ చేసేందుకు ఎప్పుడో అడుగులు మొదలుపెట్టారు బోడె రామచంద్ర యాదవ్. ఇప్పుడు మరింత వడివడిగా ముందుకెళ్తున్నారు. బీసీల్లో ఐక్యత తెస్తున్నారు. అందుకే బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార ధీక్ష..ఒక సమర్థుడి జీవిత యాత్ర అని చెప్పడం సహేతుకమే. మరి బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలంటే ఆయన అడుగులో అడుగు వేయాల్సింది ఎవరో కాదు.. బీసీ బిడ్డలే. అప్పుడే కదా భావితరాలకు సమాన హక్కులు దక్కేవి.
#BCDharmaDeeksha
