విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ: వ్యాపారస్థుల నుంచి లక్షలాది వసూళ్లు

1001014513

విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవ ఏర్పాట్లను శ్రేయాస్ మీడియాకు అప్పగించింది. స్టాల్స్ పెట్టుకునే వ్యాపారస్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్టాల్‌కు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు డబ్బులు కట్టాలని శ్రేయాస్ మీడియా డిమాండ్ చేస్తోంది.

ఈ వసూళ్లపై వ్యాపారస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు దీనిపై పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీకి అంతం పలకాలని వారు కోరుతున్నారు.