
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ మైసూర్లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో భారీ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా 500 మంది ప్రొఫెషనల్ డాన్సర్లు పాల్గొన్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా దానికి 500 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను యూనిట్ రంగంలోకి దించింది. రామ్ చరణ్ గ్రేస్‌ఫుల్ డాన్స్ స్టెప్స్‌తో పాటు ఈ భారీ ఎనర్జీ గ్రూప్ విజువల్స్ స్క్రీన్‌పై అదరగొట్టేలా ఉండనున్నాయి. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ పాటకు మాస్ బీట్స్ అందించగా జానీ మాస్టర్ కొత్త తరహా స్టెప్స్‌తో కొరియోగ్రఫీ చేశారు. శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఈ మాస్ జాతరకు రెడీ అవుతున్నారు.
