
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ప్రస్తుతం ఓటిటిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకట్.. కీలక పాత్ర పోషించగా ఆయన రోల్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర నిడివి తక్కువైనా వెంకట్ స్క్రీన్ ప్రెసెన్స్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో వెంకట్ కం బ్యాక్ ని ఆశిస్తున్నారు.
1998లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్.. ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయారు. తిరిగి ఓజీలో ఛాన్స్ దొరకడం, ఈ పాత్రకు బాగా గుర్తింపు రావడంతో వెంకట్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘ఓం హరుడు’.రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో వెంకట్ మళ్ళీ హీరోగా పెద్ద హిట్ కొట్టాలని నెటిజన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బపటేల్, సలోని, అలీ, సుమన్, రవి వర్మ వంటి పాపులర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి వెంకట్ ఈ సినిమాతో ఎలాంటి కం బ్యాక్ ఇస్తారో చూడాలి.
