‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మార్పు – నాని సినిమాకు కొత్త సమ్మర్ ప్లాన్

Screenshot 2025 06 17 155824

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి సందడి చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, షూటింగ్‌లో కొన్ని ఆటంకాల కారణంగా రిలీజ్ డేట్‌ను మార్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ముందుగా 2026 మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా, ఇతర భారీ చిత్రాలతో పోటీ రాకుండా వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ ‘పెద్ది’తో సహా టాలీవుడ్‌లో ఇతర సినిమాల రిలీజ్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. నాని ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల సమాచారం.