
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి కొన్ని సన్నివేశాలకు రూపకల్పన చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ వారం నుంచి ప్రమోషన్స్ జోరందుకోనున్నాయి. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంటర్వ్యూలతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు, కథ, పాత్రలు, నిర్మాణ విశేషాలను పంచుకోనున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా నిలవనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అవుతోంది