విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్‌కు రెడీ! గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో బ్లాక్‌బస్టర్

kingdom11739358887

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, కొన్ని సీన్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు గోవాలో రీ-షూట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. విజయ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రీ-రికార్డింగ్ కోసం అదనపు సమయం అడగడంతో రిలీజ్ జూలై 4కి వాయిదా పడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కంటెంట్ అత్యుత్తమంగా ఉండాలని నిర్మాత స్పష్టమైన సూచనలు ఇచ్చారు.