సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’తో మరోసారి యూత్‌ను ఆకట్టుకుంటారా?

WhatsApp Image 2025 06 02 at 12.13.05 6c29f794

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో సంచలనం సృష్టించిన సిద్దు జొన్నలగడ్డ, తన తాజా చిత్రం ‘తెలుసు కదా’తో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ, అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టితో సిద్దు కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. సిద్దు స్టైల్, స్వాగ్, పంచ్ డైలాగులు ఈ సినిమాలోనూ ఆకర్షణగా నిలవనున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హై-ఎండ్ ప్రొడక్షన్ విలువలతో రూపొందుతోంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, దీపావళి సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్దు సన్నద్ధమవుతున్నారు.