సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం భరోసా

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఐక్యంగా ముందుకొస్తే, పరిశ్రమకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. టికెట్ రేట్లు, అనుమతుల విషయంలో వేగవంతమైన స్పందనతో సహకారం అందిస్తున్నామని తెలిపారు. కొత్త ఫిల్మ్ పాలసీ రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై హోం శాఖ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా ఎదురైన సమస్యలపై స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచిని గౌరవిస్తామని, అస్థిరత కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వం సినీ వర్గాలను వేధించినా, ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమను ప్రోత్సహిస్తోందని వివరించారు.