
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘వార్ 2’ టీజర్ సోషల్ మీడియాను అట్టుడికిస్తోంది. హృతిక్ రోషన్ మేజర్ కబీర్‌గా స్టైలిష్ లుక్‌తో మెప్పిస్తే, జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా ఇంటెన్స్ ఎంట్రీతో గూస్బంప్స్ తెప్పిస్తున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, స్టంట్స్, లుక్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కియారా అద్వానీ గ్లామర్ టచ్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, బోట్ చేజ్, ట్రైన్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. YRF స్పై యూనివర్స్‌లో ఈ సీక్వెల్ రికార్డులను బద్దలు కొట్టనుందని అంచనాలు. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది.