వెండి తెర పై ప్రదర్శనకు సిద్ధమవుతున్న ‘భోగి’

WhatsApp Image 2025 05 02 at 15.08.10 945bcafc

పీసీ క్రియేషన్స్ పతాకంపై వరుణ్.K దర్శకత్వలో ప్రదీప్ చంద్ర నిర్మాతగా రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇదివరకే విడుదలయ్యి మంచి ప్రజాదరణ పొందింది విషయం తెలిసిందే.

Screenshot 20250502 144359 Instagram1

ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్.కె మాట్లాడుతూ నేను కెరీర్ తొలినాళ్లలో 15కు పైగా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశానని, 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశానని చెప్పారు, అప్పుడు నాతో కలిసి పనిచేసిన ప్రదీప్ చంద్ర తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేసానని. నేను అనుకున్న లైన్ బాగా నచ్చడంతో 2022లో ఈ భోగి చిత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కథకు తగ్గట్లుగానే భోగి అనే పవర్ఫుల్ టైటిల్ తో మీముందుకు వస్తున్నాం అని అన్నారు. త్వరలోనే పోస్ట్ ప్రడక్షక్న్ పూర్తి చేసి విడుదల చేస్తామన్నారు